Rajanagaram: రాజానగరంలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం!

Rajanagaram: రాజానగరంలో ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 17 Aug 2026 3:49 PM IST
Rajanagaram
X

Rajanagaram: రాజానగరంలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం!

Rajanagaram: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజానగరంలో ప్రధాన జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ పాల్గొని ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు 70వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పాత్రికేయులు అందిస్తున్న సేవలను అభినందించారు పాత్రికేయులందరూ ఐక్యతగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులు, రాజానగరం పరిధిలోని ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story