Tuni: తునిలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు!
Tuni: తునిలో ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు ఎం. త్రిమూర్తులు.
Tuni: తునిలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు!
Tuni: స్థానిక ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వియస్సార్ ఆంజనేయ ప్రసాద్ తుని వారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు ఎం. త్రిమూర్తులు అధ్యక్షతన ఈ వేడుకలు అట్టహాసంగా సాగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించి, సమష్టిగా జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని విశదీకరించారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడిన వీరులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షులు ఎం. త్రిమూర్తులు, కార్యదర్శి వియస్సార్ ఆంజనేయ ప్రసాద్, కోశాధికారి జి. కృష్ణ అప్పలస్వామి, సభ్యులు అప్పలకొండ, అమల రాజుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో పింఛనుదారులు (పెన్షనర్లు) ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరి సహకారంతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.




