Antarvedi Pallipalem: అంతర్వేదిలో మత్స్యకారుల వలకు చిక్కిన 50 కేజీల భారీ టూనా చేప!
Antarvedi Pallipalem: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 50 కిలోల భారీ టూనాఫిష్ చిక్కింది.
Antarvedi Pallipalem: అంతర్వేదిలో మత్స్యకారుల వలకు చిక్కిన 50 కేజీల భారీ టూనా చేప!
Antarvedi Pallipalem: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ టూనాఫిష్ చిక్కింది. సుమారు 50 కిలోల బరువున్న ఈ భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కడంతో వారు దానిని హార్బర్‌కు తీసుకువచ్చారు.
అక్కడ చేపను వేలం వేయగా స్థానికులు రూ.12 వేలకు కొనుగోలు చేశారు. భారీ టూనాఫిష్ లభించడంతో మత్స్యకారులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇంత భారీ చేప చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Next Story




