Antarvedi: అంతర్వేదిలో ఘనంగా వరలక్ష్మీ కుంకుమ పూజలు!
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మూడవ శుక్రవారం సందర్భంగా 600 మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.
Antarvedi: అంతర్వేదిలో ఘనంగా వరలక్ష్మీ కుంకుమ పూజలు!
అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి సుమారు 600 మంది ముత్తైదువులు హాజరై శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజల్లో పాల్గొన్న ముత్తైదువులకు ఎటువంటి పూజా రుసుము లేకుండా అమ్మవారి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం తరఫున అందజేశారు. అనంతరం భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే దేవస్థానం నిత్యాన్నదాన విభాగంలో భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




