Antarvedi: అంతర్వేది తీరంలో వలకు చిక్కిన 25 కేజీల భారీ పండుగప్ప!

Antarvedi: కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు భారీ పండుగప్ప చేప చిక్కింది.

PRABHU, RAZOLE
Published on: 9 July 2026 8:52 AM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది తీరంలో వలకు చిక్కిన 25 కేజీల భారీ పండుగప్ప!

అంతర్వేది: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో గురువారం మత్స్యకారుల వలకు భారీ పండుగప్ప చేప చిక్కి అందరి దృష్టిని ఆకర్షించింది.

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప చేప చిక్కడంతో హార్బర్ వద్ద సందడి నెలకొంది. అరుదుగా ఇంత భారీ పరిమాణంలో పండుగప్ప చేప లభించడం విశేషంగా మారింది. చేపను హార్బర్‌లో నిర్వహించిన వేలంలో స్థానిక వ్యాపారులు పోటీగా పాల్గొనగా, చివరకు రూ.20,500/ కు విక్రయించారు.

పండుగప్ప చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో భారీ ధర పలికిందని మత్స్యకారులు తెలిపారు. భారీ చేప వలకు చిక్కడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story