Antarvedi: అంతర్వేదిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 108 కలశాలతో పూజలు

Antarvedi: కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అష్టోత్తర శత కలశాభిషేకం

PRABHU, RAZOLE
Published on: 29 May 2026 8:19 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేదిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 108 కలశాలతో పూజలు

Antarvedi: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్బంగా స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యహవచనం, నిర్వహించారు.108 కలశలలో స్వామివారి 108 అష్టోత్తర నామాలతో ఆవాహనం చేసి కలశలకు పూజలు నిర్వహించారు, అనంతరం ప్రధాన కలశను ఆలయ ప్రదాన అర్చకులు శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేసి ఆ 108 కలశలతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ వి ప్రసాద్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story