Antarvedi: అంతర్వేది ఆంజనేయస్వామి ఆలయానికి నూతన రూపు!
Antarvedi: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ.60 లక్షల పుష్కర నిధులతో శంకుస్థాపన.
Antarvedi: అంతర్వేది ఆంజనేయస్వామి ఆలయానికి నూతన రూపు!
Antarvedi: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది లోని ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు రూ.60 లక్షల పుష్కర నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పాటు భక్తులకు మరింత అనుకూలంగా ఉండేలా నూతన రూపంలో అభివృద్ధి చేయనున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ఆలయం మరింత సుందరంగా, ఆకర్షణీయంగా మారనుంది.
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
Next Story




