Amalapuram: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఎమ్మెల్సీ వినతి

Amalapuram: అమలాపురం నియోజకవర్గం ఓడలరేవు వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తీయాలని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ వినతి.

SURESH, AMALAPURAM
Published on: 24 Aug 2026 5:30 PM IST
Amalapuram
X

Amalapuram: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఎమ్మెల్సీ వినతి

అమలాపురం: ఓడలరేవు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని,వారి ఆచూకీ కోసం మరింత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.సాంప్రదాయ పద్ధతుల్లో మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా చేపల వేట సాగిస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు.

అయితే 1989 నుంచి కేజీ బేసిన్‌లో గ్యాస్‌ నిక్షేపాల అన్వేషణ, ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్‌ కార్యకలాపాల కారణంగా సముద్రంలో చేపల వేట కోసం మత్స్యకారులు మరింత లోతైన ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఆఫ్‌షోర్‌ కార్యకలాపాల వల్ల సముద్ర జీవవైవిధ్యానికి,చేపల సంపదకు నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. భారతదేశంలోని మత్స్యకారులు గతంలో ఎప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడి జీవించలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఓడలరేవు నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ప్రమాదానికి గురై మృతి చెందారని ఇప్పుడే నిర్ధారించలేమని ఎమ్మెల్సీ అన్నారు.

వారు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి ఉంటే బంగ్లాదేశ్‌ పరిధిలో ఉండే అవకాశం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.అన్ని కోణాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టి మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టాలని కోరారు. మత్స్యకారుల బోట్లలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థతో పాటు ఆధునిక ట్రాకింగ్‌ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మలేషియా,సింగపూర్‌ వంటి దేశాల్లో మత్స్యకారులకు అందిస్తున్న ఆధునిక శిక్షణ తరహాలో మన మత్స్యకారులకు కూడా శిక్షణ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story