Amalapuram: కాలువ, స్మశాన వాటిక భూముల ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Amalapuram: అమలాపురం ఈదరపల్లి బైపాస్ సమీపంలో కాలువ, స్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై కలెక్టర్‌కు వీసీకే పార్టీ ఫిర్యాదు. తక్షణ సర్వే జరపాలని డిమాండ్.

SURESH, AMALAPURAM
Published on: 3 Aug 2026 9:43 PM IST
Amalapuram
X

Amalapuram: కాలువ, స్మశాన వాటిక భూముల ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

అమలాపురం: అమలాపురం ఈదరపల్లి బైపాస్ సమీపంలో అక్రమ నిర్మాణాలు,కుమ్మర కాలువ ఆక్రమణలు మరియు స్మశాన వాటిక స్థలాల కబ్జాలపై విముక్త చిరుతలకక్షి (వి.సి.కె ) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు వి. సి. కె పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ పిర్యాదు.​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై ప్రధాన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ​కుమ్మర కాలువ ఆక్రమణలు.చేపల మార్కెట్ నుండి బైపాస్ రోడ్డు వరకు గతంలో ఉన్న 10 అడుగుల కాలిబాట స్థానంలో కుమ్మర కాలువను ఆక్రమించి కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు.

దీనివల్ల స్థానిక పేద రైతుల వరి చేలు, పట్టా భూములు దెబ్బతింటున్నాయి.​స్మశాన వాటిక స్థలం కుదింపు పురపాలక సంఘం ₹10 లక్షల గ్రాంటుతో నిర్మిస్తున్న హిందూ స్మశాన వాటిక కాంపౌండ్ గోడను పాత సరిహద్దుల కంటే ముందుకు జరిపి నిర్మిస్తున్నారని,భవిష్యత్తులో స్థల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.​రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలు

రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై 42 అడుగుల రోడ్డు నిర్మాణం పేరిట ప్రజా ఆస్తులను ఆక్రమించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డేవిడ్ అంబేద్కర్,జిల్లా సెక్రెటరీ కాశి సాయికుమార్,జిల్లా యూత్ అధ్యక్షుడు పోలమూరు సందీప్, బూల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story