Amalapuram: అమలాపురంలో ఘనంగా మొహరం సంతాప కార్యక్రమాలు

Amalapuram: అమలాపురంలో భక్తిశ్రద్ధలతో మొహరం మజిలీస్ కార్యక్రమం. భారీగా హాజరైన భక్తులు. హజరత్ అబ్బాస్ పీరు ఊరేగింపుతో ఘన నివాళి.

PRABHU, RAZOLE
Published on: 19 July 2026 6:26 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఘనంగా మొహరం సంతాప కార్యక్రమాలు

అమలాపురం: మొహరం సంతాప కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం లోని బీబీ సఖీనా పంజాలో ఆదివారం మజిలీస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మత ప్రబోధకులు సర్కార్ అలీ షమ్స్ మజిలీస్ ఆలపించి మొహరం పర్వదినం విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

మజిలీస్ అనంతరం పంజా నుంచి హజరత్ అబ్బాస్ పీరును ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం మాతం నిర్వహించి బీబీ సఖీనాకు ఘన నివాళులు అర్పించారు.

అమలాపురం యువకుల గ్రూపుల ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story