Amalapuram: కోనసీమ మత్స్యకారుల రక్షణ: ఎంపీ హరీష్ బాలయోగి చొరవ!
Amalapuram: బోడలరేవు ఏడుగురు మత్స్యకారులను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ముమ్మర చర్యలు చేపట్టారు.
Amalapuram: కోనసీమ మత్స్యకారుల రక్షణ: ఎంపీ హరీష్ బాలయోగి చొరవ!
అమలాపురం: ఏడుగురు మత్స్యకారుల ఆరోగ్య పరీక్షలు అనంతరం స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు త్వరి త్వరగా పూర్తిచేయాలని కలకత్తా గవర్నమెంట్ కు ఉత్తరువులు జారీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి.కలకత్తాలో ఉన్న ఏడుగురు మత్స్యకారులను అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని ఎంపీ అన్నారు. బోడలరేవు సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులకు కలకత్తా లో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి.
ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కృషితో ఏడుగురు మత్స్యకారులను స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు కోసం కలకత్తా డీఐజీ తో మాట్లాడిన ఎంపీ హరీష్ బాలయోగి.ఏడుగురు మత్స్యకారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అచ్చం నాయుడు,ఎంపీ హరీష్ బాలయోగి వాళ్ళ యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈరోజు సాయంత్రం కల్లా ఏడుగురు మత్స్యకారులను స్వగ్రాహానికి రప్పించే ఏర్పాట్లు కోసం ఎప్పటికప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న అధికారులతో సంప్రదింపులు మమ్మరం చేయమని ఎంపీ హరీష్ బాలయోగి కలకత్తా మెరైన్ డీఐజీ అధికారులతో ఫోన్లో సంభాషించిన ఆడియో వాయిస్. ఏడుగురు మత్స్యకారులకు తినడానికి భోజనం త్రాగడానికి నీళ్లు లేక సుమారుగా మూడో రోజులు నుంచి పచ్చి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడ్డారు.
ఎంపీ హరీష్ బాలయోగి ఏడుగురు మత్స్యకారుల జాడ కోసం న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి కేంద్రం నుంచి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.కాకినాడ కోస్ట్ గార్డ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక గాలింపులు చర్యలు తీసుకోవాలి అని అధికారులతో ముమ్మరం చేసిన అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి.
కూటమి ఎంపీ, మంత్రిలకు,ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఏడుగురు మత్స్యకార కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఏడుగురు మత్స్యకారులను స్వగ్రామాలకు తీసుకొచ్చే ప్రక్రియ కోసం ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబలతో సంప్రదిస్తు సమాచారం చేరవేస్తున్నాం ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.




