Amalapuram: ఓడలరేవులో పండుగ వాతావరణం.. ఎంపీ హరీష్‌కు కృతజ్ఞతలు!

Amalapuram: కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి బెంగాల్‌లో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను ఎంపీ గంటి హరీష్ బాలయోగి చొరవతో అధికారులు స్వగ్రామానికి క్షేమంగా చేర్చారు.

SURESH, AMALAPURAM
Published on: 28 Aug 2026 7:13 PM IST
Amalapuram
X

Amalapuram: ఓడలరేవులో పండుగ వాతావరణం.. ఎంపీ హరీష్‌కు కృతజ్ఞతలు!

అమలాపురం: ఎంపీ హరీష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఓడలరేవు గ్రామస్థులు.అన్ని లాంఛనాలు పూర్తి చేసి వెస్ట్ బెంగాల్ నుండి,సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను స్వగ్రామానికి తరలించడంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కీలక పాత్ర పోషించారు. నేడు వారిని స్వగ్రామానికి చేర్చి మత్స్యకారులకు అండగా నిలిచారు.

గల్లంతైన మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.గల్లంతైన బోటును తీరానికి చేర్చడంలో సహాయం చేసిన ఇరువురికి,హరీష్ మరియు గ్రామస్థులు దుశ్శాలువాలతో సన్మానం చేశారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసి, మత్స్యకారులకు వెన్నంటి ఉన్న ఎంపీ హరీష్ బాలయోగి కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం అధికసంఖ్యలో గ్రామస్తులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు తదితరులుపాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story