Amalapuram: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి
Amalapuram: అమలాపురం గడియారస్తంభం సెంటర్‌లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలు.
Amalapuram: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి
అమలాపురం: 71వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌కు ఎంపీ హరీష్ బాలయోగి శుభాకాంక్షలు. అమలాపురం గడియారస్తంభం సెంటర్లో లో కేక్ చి చేసిన ఎంపీ హరీష్.మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు.
ప్రజా జీవితంలో కూడా చిరంజీవి ‘అందరివాడు’గా తనను తాను నిరూపించుకున్నారని పేర్కొన్నారు.చిరంజీవి వ్యక్తిత్వం, మానవతా దృక్పథం,సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎంపీ కొనియాడారు.చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ,అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ తదితరులు, కూటమి నేతలు,మెగా అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




