Amalapuram: రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాల కౌంటర్ ప్రారంభం

Amalapuram: అమలాపురం రైతు బజార్‌లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే ప్రత్యేక కౌంటర్‌ను ఎమ్మెల్యే ఆనందరావు, కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు.

SURESH, AMALAPURAM
Published on: 3 Aug 2026 11:52 AM IST
Amalapuram
X

Amalapuram: రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాల కౌంటర్ ప్రారంభం

అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురం నియోజకవర్గం.

అమలాపురం రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాల కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

తేది 03-08-2026 సోమవారం ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ,బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం అందించే ప్రత్యేక కౌంటర్‌ను అమలాపురం రైతు బజార్‌లో శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు,అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.ఆర్ మహేష్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి కలిసి ప్రారంభించారు.ఆగస్టు 1 నుండి రైస్ మిల్లర్ల సౌజన్యంతో రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్లలో తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఇందులో భాగంగా బహిరంగ మార్కెట్‌లో ₹62.00 ఉన్న స్టీమ్ బియ్యం (బి.పి.టి.) ను ప్రత్యేక కౌంటర్లలో ₹52.00లకే,అలాగే బహిరంగ మార్కెట్‌లో ₹58.00 ఉన్న రా బియ్యం (బి.పి.టి.) ను ₹50.00లకే విక్రయిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 రైతు బజార్ల బియ్యం కౌంటర్లు మరియు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక పాయింట్ల ద్వారా ఈ విక్రయాలు సాగుతున్నాయి. "మాటల్లో కాదు - చేతల్లో సంక్షేమం" అనే ధ్యేయంతో ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ రావు కోరారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story