Allavaram: ఎమ్మెల్యే ఆనందరావుపై దుష్ప్రచారం మానుకోవాలి!
Allavaram: తాడికొన పికలేరు డ్రెయిన్ పనులపై దుష్ప్రచారం మానుకోవాలని రైతులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆనందరావు చొరవతోనే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
Allavaram: ఎమ్మెల్యే ఆనందరావుపై దుష్ప్రచారం మానుకోవాలి!
Allavaram: అల్లవరం మండలం తాడికొన గ్రామంలో పికలేరు డ్రైన్ అభివృద్ధి పనులపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తాడికొన గ్రామ వరి,ఆక్వా రైతులు అన్నారు. వైసీపీ వాళ్ళు అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్నా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పై విమర్శలు, దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.
తాడికొన గ్రామం రైతు గోసంగి స్టాలిన్ బాబు స్వగృహం వద్ద వరి,ఆక్వా రైతులు సమావేశం జరిగింది.ఈ సందర్బంగా స్టాలిన్ బాబు మాట్లాడుతూ డ్రైన్పై సమస్య ఉన్నది వాస్తవమే రైతులకు కిట్టుబాటు లేక పంట వేయలేదని,అ ఒక్క డ్రైన్ పై రైతులు కాకుండా గ్రామంలో ఉన్నా మూడు డ్రైన్ల పై రైతులు పంట వేయలేదని గుర్తుచేశారు.
ఈ విషయాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసువెల్లగా సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకున్నారన్నారు.నూకల బుల్లి నాయుడు మాట్లాడుతూ తాడికొనలో రైతులు క్రాప్ హాలిడే అన్నది అవస్తవమని, రైతులు అందరూ ఒక మాటపై మొదటి పంటకు వేయకుండా తొందరగా ద్వాల్వ పంట వేసుకుందామని అన్నారు. దీనిని కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
500 మీటర్లు డ్రైన్ తవ్వకాలు చేయవల్సి ఉండగా ఎమ్మెల్యే ఆనందరావు చొరవతో 900 మీటర్లు తవ్వారని,300 మీటర్లు తవ్వావాల్సి ఉండగా కొంతమేరా జిరాయితీ భూమి ఉందని,అలాగే ఇప్పటికే ఆక్వా రైతులు పంట వేసివున్నామని, వరి రైతులు పంట వేయలేదు కాబట్టి మా ఆక్వా పంట మధ్యలో ఉందని,రెండు నెలలు సమయం ఇచ్చి తర్వాత డ్రైన్ తవ్వకాలు చెయ్యాలని కోరడంతో అ 300 మీటర్లు తవ్వకాలు చేయలేదన్నారు. సాధానాల గోవిందు రాజు మాట్లాడుతూ తాడికొన రైతులు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కృషిచేస్తున్నారని,మా గ్రామ వరి, ఆక్వా రైతులు సమావేశమై చర్చించుకుంటామని అన్నారు.
అలాగే వైస్సార్సీపీ పార్టీ శక్తులు సాక్షి టీవీ చానల్ ఎమ్మెల్యే ఆనందరావుపై దృశప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గోసంగి ప్రవీణ్ కుమార్,సుంకర వెంకటేశ్వరరావు,సాధానాల రమేష్,శిరంగు సత్యనారాయణ రైతులు తదితరులు పాల్గొన్నారు.




