Amalapuram: ఆగస్టు 3 నుంచి రైతుబజార్లలో కేజీ సన్న బియ్యం ₹50కే జేసీ
Amalapuram: కోనసీమ జిల్లా రైతుబజార్లలో ఆగస్టు 3 నుంచి ₹50కే సన్న బియ్యం. అధికారులతో సమీక్షించిన జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి.
Amalapuram: ఆగస్టు 3 నుంచి రైతుబజార్లలో కేజీ సన్న బియ్యం ₹50కే జేసీ
అమలాపురం: జిల్లాలో రైతు బజార్ మార్కెట్లలోని సన్న బియ్యం పంపిణీపై ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు రైస్ మిల్లర్లు యజమాన్యం పౌరు సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుబజార్లలో రాయితీపై బియ్యం విక్రయం ఆగస్టు 3 నుంచి సన్నాలు ₹50, స్టీమ్ రైస్ ₹52కే లభ్యం అవుతాయని రైస్ మిల్లర్ల యాజమాన్యంతో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి తెలియజేశారు.
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఆగస్టు 3 నుంచి జిల్లాలోని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల రద్దీ అధికంగా ఉండే రైతుబజార్లలో ప్రత్యేక విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి. రైస్ మిల్లర్లు తగినంత బియ్యం నిల్వలను సిద్ధంగా ఉంచి, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా సరఫరా చేయాలి.
ప్రతి కౌంటర్‌లో రోజువారీ విక్రయాల వివరాలు, ప్రారంభ మరియు ముగింపు నిల్వల వివరాలను రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలి. బియ్యం కొరత తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అడపా ఉదయ భాస్కర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్, కోనసీమ జిల్లా రైస్ మిల్ల ర్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. లక్ష్మీనారాయణ, కొత్తపేట రైస్ మిల్లర్ అధ్యక్షుడు ఓ పాపారావు రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైతుబజార్ ఎస్టేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




