Amalapuram: అమలాపురంలో రూ.999 కే ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీ
Amalapuram: అమలాపురం మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్‌లో రూ.999లకే ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. సెప్టెంబర్ 10 వరకు ఆఫర్.
Amalapuram: అమలాపురంలో రూ.999 కే ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీ
అమలాపురం: అమలాపురం మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ అమలాపురం ఆధ్వర్యంలో అందిస్తున్న రూ.999/- ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, ప్రివెంటివ్ కేర్ (Preventive Care) ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు.
రూ.999/-కే అందిస్తున్న ఈ ప్రత్యేక కార్డియాలజీ ప్యాకేజీ ద్వారా గుండె ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన పరీక్షలు చేయించుకుని,గుండె సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ప్రజలకు లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ అమలాపురం ప్రాంతంలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే అభినందించారు.
ముఖ్యంగా ఎమర్జెన్సీ వైద్య సేవల్లో మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ ముందంజలో ఉందని, అత్యవసర సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా ప్రశంసించారు.రూ.3,800 విలువైన ఈ ప్యాకేజీని ప్రత్యేక ఆఫర్‌గా కేవలం రూ.999/-కే అందిస్తున్నట్లు మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు.
ఈ ప్రత్యేక ఆఫర్ 10 సెప్టెంబర్ 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గుండె ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షించుకోవాలని మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ కోరుతోంది.ఈ కార్యక్రమంలో కిమ్స్ సురేష్,గుమ్మల్ల శివ ప్రసాద్,పెద్దిరాజు,గణేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా,గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్ ఇలాంటి ప్రివెంటివ్ హెల్త్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది సంప్రదించండి 9851247365.




