Konaseema: హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలి: అమలాపురంలో దళిత సంఘాల నిరసన

Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేసి, ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలని అమలాపురంలో దళిత జేఏసీ డిమాండ్ చేసింది.

SURESH, AMALAPURAM
Published on: 12 Sept 2026 6:07 PM IST
Konaseema
X

Konaseema: హమారా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలి: అమలాపురంలో దళిత సంఘాల నిరసన

Konaseema: డాక్టర్ అంబేద్కర్ చరిత్రను వక్రీకరిస్తున్న హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి అసత్యాలతో రచించిన కల్పిత నాయకుడు పుస్తకాన్ని నిషేధించాలి. హమారా ప్రసాద్ వ్యాఖ్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఆయన యొక్క ఘనమైన చరిత్రను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాలలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అసత్యాలతో డాక్టర్ అంబేద్కర్ పై విషం కక్కుతూ రచించిన కల్పిత నాయకుడు పుస్తకాన్ని నిషేధించి రెండు తెలుగు రాష్ట్రాల మరియు కేంద్ర ప్రభుత్వాలు హమారా ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించి అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా దళిత సంఘాల జేఏసీ పిలుపుమేరకు శనివారం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం పట్టణ పోలీసు స్టేషన్లో హమారా ప్రసాద్ ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ డాక్టర్ అంబేద్కర్ను కీర్తిస్తూ ప్రపంచ విజ్ఞాన నాయకుడిగా గౌరవిస్తుంటే మనదేశంలో కొంతమంది హమారా ప్రసాద్ లాంటి మనువాద మూర్ఖులు డాక్టర్ అంబేద్కర్ చరిత్రను వక్రీకరిస్తూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని తప్పుడు వాక్యాలు చేస్తూ ఆయనను కించపరిచేలా అసత్యాలతో కూడిన ఒక పుస్తకాన్ని రచించడం వెనక ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ లాంటి మతోన్మాద శక్తులు హమారా ప్రసాద్ లాంటి సంఘవిద్రోహులకు అండగా ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు.

డాక్టర్ అంబేద్కర్ దళితులకు మాత్రమే రాజ్యాంగం రాయలేదని దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రచించారని ఆయన సేవలను గుర్తిస్తూ భారతదేశం భారతరత్న ప్రకటించిందని గుర్తు చేశారు.

ప్రపంచ దేశాలన్నిటిలో ఘనమైన చరిత్ర గలిగిన డాక్టర్ అంబేద్కర్ మనదేశంలో ఉన్న హిందూ మతోన్మాద శక్తులు కించపరచడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన రాసిన రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమారా ప్రసాద్ అంబేద్కర్ పై అత్యంత దారుణంగా మాట్లాడుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘవిద్రోహి అయిన హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అసత్యాలతో హమారా ప్రసాద్ రచించిన కల్పిత నాయకుడు పుస్తకాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హమారా ప్రసాద్ ను అరెస్టు చేసేంతవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డీబీ లోక్ దళిత ఐక్యవేదిక కన్వీన జంగా బాబురావు కో కన్వీనర్ రేవు తిరుపతిరావు మాల మహానాడు రాష్ట్ర నాయకులు పెయ్యల పరశురాముడు జల్లి శ్రీనివాసరావు గూటం సాయి మాకే సిద్దు,రొక్కాల నాగేశ్వరరావు మెండు దుర్గాప్రసాద్ గెద్దాడ బుద్ధ రాజ్ నాగవరపు అన్నవరం పరమట సింగ్ చిట్టిబాబు నిఖిల్ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM