Amalapuram: ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక చర్యలు కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram: అమలాపురంలో ఆక్వా ఆధారిత ప్రాజెక్ట్ల పురోగతిపై కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్షించారు. సీవీడ్, పీతల సాగును ప్రోత్సహించి మహిళలకు ఉపాధి కల్పించాలన్నారు.
Amalapuram: ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక చర్యలు కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం: కోనసీమ జిల్లాలో సాంప్రదాయ ఆక్వా సాగుతో పాటు రైతులకు అధిక ఆదాయం అందించే వినూత్న ఆక్వా ఆధారిత ప్రాజెక్టులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ డిఆర్డిఏ- సెర్ఫ్ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు జిల్లాలో ఆక్వా ఆధారిత ప్రాజెక్టులు పురోగతికి సంబంధించి సీవీడ్ (సముద్రపు నాచు), పీతల సాగు,పండుగప్ప (సీ బాస్) సాగును విస్తృతంగా చేపట్టేలా రైతులకు అవసరమైన సాంకేతిక,మార్కెటింగ్ సహకారం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీవీడ్ సాగును జిల్లాలో ప్రాథమికంగా 10 క్లస్టర్లలో చెరువుల ద్వారా చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. గ్రాసిలేరియా రకంతో పాటు సీవీడ్ ఆధారిత విలువ జోడించిన ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృతా యూనివర్సిటీ సహకారంతో ఉత్పత్తుల మార్కెటింగ్,రైతులకు హ్యాండ్‌హోల్డింగ్ సపోర్ట్ అందుతున్నట్లు పేర్కొన్నారు.తీర ప్రాంత చెరువుల్లో సముద్రపు నాచు సాగు ఉత్పత్తి జిల్లాలో 7386 స్వయం సహాయక మహిళా సంఘాలు ద్వారా 9267.15 లక్షల వ్యయంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో అమృత యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
కోనసీమ జిల్లాలో 150 స్వయం సహాయక మహిళల సంఘాల ద్వారా 10 కమర్షియల్ సివిడ్ కల్చర్ క్లస్టర్ చెరువుల ద్వారా అనువైన మూడు గ్రామాలలో 50 టన్నుల ఉత్పత్తయ్యే సముద్రపు నాచు సాగు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ముఖ్యంగా కొత్తపట్నం లో మొల్లటిమోగా,కాట్రేనికోన మండలం చిరయానం లో నీల రేవు,ఉప్పలగుప్త మండలంలో వాసల తిప్ప, అల్లవరం మండలంలో ఓడల రేవు, మల్కిపురం మండలంలో తూర్పు పాలెం సంబంధించి అనువైన ప్రాంతాలలో మూడు గ్రామాలను సముద్రపు నాచు సాగు ప్రతిపాదించడం జరిగిందన్నారు.
సెర్ఫ్ ఆధ్వర్యంలో చిరయానం గ్రామంలో 25 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా తీర ప్రాంత చెరువులో సముద్రపు నాచు సాగు వల్ల ఉత్పత్తి అయ్యే పచ్చళ్ళు మరియు సబ్బులు తయారీకి గ్రాసిలేరియా రకంతో విలువ ఆధారిత ఉత్పత్తులు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
సెర్ప్ ద్వారా ఎన్ఆర్ఎల్ఎం లివ్లీహుడ్ ఫండ్స్ కింద కాట్రేనికోన మత్స్యకార ఉత్పత్తిదారులకు ₹40.00 లక్షల వ్యయంతో పైలట్ యూనిట్ల ఏర్పాటుకు మలకోనదిపురం, ఎన్. కొత్తపల్లి ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడి స్థల అనుకూలత, సాంకేతిక అంశాలను CIBA నిపుణులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు.
కాట్రేనికోనలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపుతో సీవీడ్ ఆధారిత సబ్బులు, ఇతర విలువ జోడించిన ఉత్పత్తులను సెర్ప్ ఆధ్వర్యంలో మార్కెట్లోకి తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా మహిళా సంఘాలకు, రైతులకు అదనపు ఆదాయం లభించేలా చూడాలన్నారు.
జిల్లాలో సుమారు 1,300 ఎకరాల్లో పీతలు,ఆసియన్ పండుకప్ప సాగు జరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన సీడ్ కొరతను అధిగమించేందుకు సీబా (CIBA) సహకారంతో స్థానికంగా నర్సరీ రేరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనం తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో పాటు సాగులో నష్టాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 9 సీఎం పర్యటన నేపథ్యంలో వినూత్న రీతిలో ఆక్వారంగా ఆధారిత ఉత్పత్తులు ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు కొరకు సీవీడ్, పీతలు, పండుగప్ప సాగు విధానాలు అంశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో ఆక్వా రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రైతుల ఆదాయం పెంచే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సెర్ప విజయవాడ ఎఫ్.ఈ వెంకటేశ్వరరావు డిపిఎం వి. పరమేష్,డిఆర్డిఏ డి రాంబాబు డి పి ఆర్ ఓ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




