Amalapuram: 'చలో అమలాపురం' సభను విజయవంతం చేయాలి: ఆక్వా రైతు సంఘం పిలుపు
Amalapuram: పెరిగిన సీడ్, ఫీడ్ ధరలను తగ్గించాలని కోరుతూ సెప్టెంబర్ 7న అమలాపురంలో ఆక్వా రైతులు 'చలో అమలాపురం' మహాసభ నిర్వహించనున్నారు.
Amalapuram: 'చలో అమలాపురం' సభను విజయవంతం చేయాలి: ఆక్వా రైతు సంఘం పిలుపు
Amalapuram: అమలాపురంలో ఆక్వా రైతులు ఈ రోజు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు.ఈనెల 7వ తేదీ న ఆక్వా రైతులు చలో అమలాపురం పేరుతో పోరుబాట పట్టనున్న ఆక్వా రైతులు. ప్రభుత్వం పెంచిన సీడ్,ఫీడ్ ధరలకు నిరసనగా ఆక్వా రైతుల రాష్ట్ర వ్యాప్త మహా సభ ఏర్పాటు చేయాలి అని ఆక్వా రైతులు ఆందోళన బాట పెట్టానునారు. రాష్ట్రలో ఆక్వా రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాటు చేస్తున్నారు.
అమలాపురంలో చలో అమలాపురం పేరుతో అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మండపంలో మహా సభ ఏర్పాటు చేసిన ఆక్వా రైతులు.ఆక్వా రైతుల పోరుబాట మహా సభను విజయవంతం చేయాలన్న రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యదర్శి చవటపల్లి నాగభూషణం పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతుల సూచనలు సలహాలతో ఉద్యమ కార్యచరణ చేపడతాం అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చి పవర్ సబ్సిడీ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు అన్నారు.
ప్రభుత్వం తక్షణమే సీడ్,ఫీడ్ ధరలు తగ్గించి ఆక్వా రైతులను ఆదుకోవాలి లేనిపక్షంలో రాష్ట్ర ఆక్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ చేపడతాం అని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యదర్శి చవటపల్లి నాగభూషణం ప్రభుత్వంన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




