Amalapuram: వైద్యులు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'అభయ డే' వాకథాన్
Amalapuram: అమలాపురంలో వైద్యులు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'అభయ డే' సందర్భంగా భారీ వాకథాన్ నిర్వహించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Amalapuram: వైద్యులు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'అభయ డే' వాకథాన్
అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం నియోజకవర్గం.
వైద్యులు,మహిళలపై హింసకు వ్యతిరేకంగా అమలాపురంలో 'అభయ డే' వాకథాన్.
వైద్యులు,ఆరోగ్య సంరక్షణ సిబ్బంది,మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని,వారి రక్షణకు ప్రతి ఒక్కరూ గళమెత్తాలని పిలుపునిస్తూ 'ది ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా' (FOGSI) ఆధ్వర్యంలో 'అభయ డే' (Abhaya Day) ను పురస్కరించుకుని అమలాపురంలో వాకథాన్ (Walkathon) నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఐ ఎం ఏ కోనసీమ,అమలాపురం అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టారు. డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా వాకథాన్ (Walkathon Against Violence on Doctors): అమలాపురం గడియారం సెంటర్ నుండి ప్రారంభమై ఐ.ఎం.ఎ (IMA) హాల్ వరకు సాగింది.
వైద్యులు,మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచేందుకు ‘నో టు వయోలెన్స్ ఎగైనెస్ట్ విమెన్ కమిటీ’, ‘వయోలెన్స్ ఎగైనెస్ట్ డాక్టర్స్ కమిటీ’ ‘పబ్లిక్ అవేర్‌నెస్ కమిటీ’ల ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు.అభయ ఘటన మరువక ముందే రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ని పొట్టను పెట్టుకున్న సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉందని ఐ ఎం ఏ కార్యదర్శి వై టి నాయుడు అన్నారు.సమాజంలో వైద్యులకు,ఆరోగ్య కార్యకర్తలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే నఐ ఎం ఏ అధ్యక్షులు డాక్టర్ శివ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమం లో
ఐ ఎం ఏ అధ్యక్షులు డాక్టర్ శివ కుమార్,కార్యదర్శి డాక్టర్ వై టి నాయుడు,రాష్ట్ర అధ్యక్షులు ( ఎలెక్ట్ ) పి ఎస్ శర్మ,సీనియర్ వైద్యులు డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సురేష్ బాబు,డాక్టర్ దీక్షితులు,డాక్టర్ రామమూర్తి, డాక్టర్ మాధవి,డాక్టర్ స్మిత,వై అనంత లక్ష్మీ డాక్టర్ కావ్య, డాక్టర్ కె రమణకుమార్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల బాబీ తదితర సభ్యులు పాల్గొన్నారు.




