Ainavilli: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ!
Ainavilli: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Ainavilli: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ!
Ainavilli: స్వయంభుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఆలయ ముఖ మండపాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పళ్ళ రసాల తో అభిషేకము, గణపతి హోమం నిర్వహించనున్న అర్చక స్వాములు.
స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీరు ప్రసాద వితరణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల, వృద్ధుల, వికలాంగులు, చిన్న పిల్లలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఆలయాన్ని వివిధ రకాల పూల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.




