Razole: కాలేజీ బస్సు-కారు ఘోర ఢీ.. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది!

Razole: మండలం చింతలపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం తప్పింది. సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సును స్విఫ్ట్ డిజైర్ కారు బలంగా ఢీకొట్టింది.

PRABHU, RAZOLE
Published on: 30 Jun 2026 10:22 AM IST
Razole
X

Razole: కాలేజీ బస్సు-కారు ఘోర ఢీ.. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది!

రాజోలు: మండలం చింతలపల్లి కలింగుల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది.

సుమారు 50 మంది విద్యార్థులతో అమలాపురం వైపు వెళ్తున్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ బస్సును ఎదురుగా వేగంగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న శబ్దానికి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

బస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో క్షణాల్లోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో బస్సులో వారికి గాని,కారులో ఉన్న వారికి గాని ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న రాజోలు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసే దిశగా చర్యలు ప్రారంభించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story