Razole: 42వ వారం ‘కేడర్ విత్ లీడర్’: ప్రజల నుంచి వెల్లువెత్తిన అర్జీలు!
Razole: రాజోలు మండలం శివకోటిలో 42వ వారం 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమం జరిగింది. తిరంగా యాత్ర అనంతరం ప్రజల నుంచి నేతలు అర్జీలను స్వీకరించారు.
Razole: 42వ వారం ‘కేడర్ విత్ లీడర్’: ప్రజల నుంచి వెల్లువెత్తిన అర్జీలు!
రాజోలు: రాజోలు నియోజకవర్గంలో 42వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆదేశాల మేరకు శుక్రవారం రాజోలు మండలం శివకోటి గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు శివకోటిలోని ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి టీడీపీ కార్యాలయం వరకు త్రివర్ణ పతాకాలను చేతబట్టి తిరంగా యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో రాజోలు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూటమి శ్రేణుల నుంచి నాయకులు అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించిన వినతులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన అర్జీలను కూడా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్, లంకే శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు అనుచూరి సునీత రామ పురుషోత్తం, బోనం సత్య నాగేశ్వరరావు బాబు, అడబాల సాయిబాబా, తాడి సత్యనారాయణ, కసుకుర్తి త్రినాధ స్వామి, ఆరుమిల్లి భాను, విత్తనాల జానకిరామ్, గోనిపాటి రాజు, పప్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




