Konaseema: జ్ఞాపకాల జడిలో.. 1979-80 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక!
Konaseema: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముంగండలో 1979-80 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.
Konaseema: జ్ఞాపకాల జడిలో.. 1979-80 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక!
Konaseema: డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంగండ లోని శ్రీ పి.వి.ఆర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1979–80 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన సుమారు 53 మంది పూర్వ విద్యార్థులు ఇటీవల ఆత్మీయ కలయిక సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబోధన చేసిన ఇద్దరు గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. సహ విద్యార్థులతో కలిసి ఆటపాటలు, సరదా కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసభరిత వాతావరణంలో సందడి చేశారు. దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా నిలిచి పాల్గొన్న వారందరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.




