Malikipuram: లక్కవరంలో 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం, అరెస్ట్!

Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో 1,100 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 19 Aug 2026 8:05 AM IST
Malikipuram
X

Malikipuram: లక్కవరంలో 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం, అరెస్ట్!

Malikipuram: గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రవాణాకు ఉపయోగిస్తున్న టాటా మ్యాజిక్ గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు.

లక్కవరం గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలో గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి, చిన్నచిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో మలికిపురం ఎస్సై మోహన్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా గంజాయి విక్రయిస్తున్న కందికట్ల ప్రదీప్ (33)ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రాజోలు సీఐ సురేష్‌ బాబు మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలు, అక్రమ నిల్వలపై పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story