Personality Test: మీరు కూర్చునే స్టైల్ మీ సీక్రెట్స్ చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా?

Personality Test: మీరు కూర్చునే విధానం మీ మనస్తత్వాన్ని చెబుతుందని మీకు తెలుసా? కాళ్లు దగ్గరగా పెట్టి కూర్చున్నా, కాలు మీద కాలు వేసినా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 8 April 2026 11:27 AM IST
Personality Test
X

Personality Test: మీరు కూర్చునే స్టైల్ మీ సీక్రెట్స్ చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా?

Personality Test: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వార్త మన ముందుకు వస్తూనే ఉంది. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, మరియు పర్సనాలిటీ టెస్టులకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం లేదా న్యూమరాలజీ ద్వారా మన జాతకాలను తెలుసుకుంటాం. కానీ, మన ప్రవర్తన, నడిచే తీరు, బ్యాగ్ పట్టుకునే విధానం మరియు కూర్చునే పొజిషన్ (Sitting Posture) కూడా మన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం.. మీరు కూర్చునే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం:


1. కాలు మీద కాలు వేసి కూర్చోవడం (Crossed Legs)

ఇలా కూర్చునే వారు కాస్త భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచం కంటే ఊహల్లో, కలల్లో ఎక్కువగా విహరిస్తుంటారు. అందరితో అంత త్వరగా కలిసిపోరు. ప్రతి విషయంలోనూ తప్పులు వెతకడం వీరి నైజం. కొంతవరకు 'తామే గొప్ప' అనే భావన వీరిలో కనిపిస్తుంది. వీరి ఆలోచనా విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది.


2. మోకాళ్లను దగ్గరగా పెట్టి కూర్చోవడం (Knees Together)

మోకాళ్లను దగ్గరగా చేర్చి నిటారుగా కూర్చునే వారు చాలా క్రమశిక్షణ గలవారు. వీరికి ముందుచూపు ఎక్కువ. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు. సమయపాలన (Punctuality) మరియు పరిశుభ్రతకు వీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అత్యంత నిజాయితీగా ఉండే మనస్తత్వం వీరి సొంతం.


3. మోకాళ్ల మధ్య దూరం పెట్టి కూర్చోవడం (Knees Apart)

మోకాళ్ల మధ్య గ్యాప్ ఇచ్చి కూర్చునే వారిలో కాస్త అహంకారం ఎక్కువేనని ఈ పరీక్ష చెబుతోంది. వీరికి కొన్ని విషయాలపై సరైన అవగాహన ఉండదు మరియు సమయాన్ని బట్టి మాటలు మార్చే స్వభావం ఉంటుంది. అయితే, వీరు ఇతరులకు తోడుగా ఉండటానికి ఇష్టపడతారు. సమాజంలో తాము చాలా గొప్పగా కనిపించాలని నిరంతరం తాపత్రయపడుతుంటారు.

గమనిక: ఇవి కేవలం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం మరియు కొన్ని మానసిక విశ్లేషణల ఆధారంగా రూపొందించినవి మాత్రమే. ప్రతి వ్యక్తి స్వభావం వారి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story