Summer: వేడి సెగ గడ్డలను ఇంట్లోనే ఇలా తగ్గించేద్దామా!

Summer:ఎండాకాలంలో శరీరంలో వేడి పెరగడం వల్ల వచ్చే సెగ గడ్డలను సహజమైన ఇంటి పదార్థాలతో ఎలా తగ్గించుకోవాలో ఈ కథనం వివరిస్తుంది.

Ramya Thota
Updated on: 2 May 2026 6:46 PM IST
heat boils
X

heat boils

డాకాలం ఎండలు మండిపోతున్నప్పుడు శరీరంలో వేడి బాగా ఎక్కువైనప్పుడు చర్రంపై ఎర్రటి సెగ గడ్డలు, నొప్పిగా ఉండే వేడి కురుపులు వస్తాయి.






ఈ సెగ గడ్డల సమస్యకు కెమికల్స్‌ కూడిన మందులు అవసరం లేకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.





వేడి నీటిలో ఒక శుభ్రమైన కాటన్‌ గుడ్డను ముంచి బాగా పిండి ఆ క్లాత్‌ని సుమారు 10 నిమిషాల పాటు ఆ వేడి కురుపుపై ఉంచాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయడం మంచిది.





పసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పసుపు తీసుకుని కొన్ని నీళ్లు లేదా పాలు కలిపి పేస్ట్‌లా చేసి కురుపుపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.





ఈ వేప ఆకులు సహజమైన క్రిమినాశినిగా పనిచేస్తాయి. ఇవి చర్మ వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కురుపులపై రాయాలి.





వెల్లుల్లిలో యాంటీ ఆక్సీడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మరియు యాంటీ బ్యాకీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గుణాలు వేడి కురుపులు, సెగ గడ్డలను తగ్గించడంలో తోడ్పడుతాయి.





కలబంద చర్మానికి చలువ చేస్తుంది. ఇది నొప్పిని, మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి కలబంద జెల్‌ కొంచెం తీసుకుని వేడి కురుపునై నేరుగా రాయడం వల్ల ఆ ప్రాంతం చల్లబడి తొందరగా కురుపు మానిపోతుంది.












Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story