Health Tips for Women: మహిళల ఆరోగ్యం కోసం 5 సూపర్‌ఫుడ్స్: ఇవి తింటే రోగాలు దూరం!
Health Tips for Women: బిజీ జీవనశైలి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే మహిళల కోసం వైద్య నిపుణులు కొన్ని సూపర్‌ఫుడ్స్‌ను సూచిస్తున్నారు. క్యాన్సర్ నివారణ నుంచి ఎముకల బలం వరకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.
Health Tips for Women: మహిళల ఆరోగ్యం కోసం 5 సూపర్‌ఫుడ్స్: ఇవి తింటే రోగాలు దూరం!
Health Tips for Women: మహిళల ఆహార అవసరాలు పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వారు ఫిట్‌గా ఉండేందుకు రోజూ తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన ఆహారాలు ఇవే:
పండ్లు: ద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెర్రీస్ వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ కణాల నష్టాన్ని నివారిస్తాయి. బొప్పాయి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీన్స్: ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు (BP) మరియు షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పెరుగు: కాల్షియం లోపాన్ని భర్తీ చేసి ఎముకలను దృఢంగా మారుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తీసుకోవడం ఉత్తమం.
అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఈ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిని సలాడ్స్ లేదా పెరుగులో కలుపుకుని తీసుకోవచ్చు.
పాలకూర: ఇందులో ఫోలేట్ మరియు ల్యూటిన్ ఉంటాయి. ఇది గుండె జబ్బులను నివారించడమే కాకుండా, కంటిచూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.




