Chiranjeevi: మెగాస్టార్ కొత్త లుక్ అదిరింది.. 70లోనూ అదే స్వాగ్
70 ఏళ్ల వయసులోనూ చిరంజీవి స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. మెగా 158 కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi Latest Photos Viral at 70 Mega 158 Look
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ అదే స్వాగ్, అదే ఎనర్జీతో కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా మెగా టీమ్ విడుదల చేసిన చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తయినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా మెగా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. “తరాలు మారాయి.. ట్రెండ్స్ మారాయి.. కానీ చిరంజీవి ఆరా మాత్రం ఎప్పటికీ సాటిలేనిది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి కొత్త లుక్ చూసిన అభిమానులు ఇదే ‘మెగా 158’ గెటప్ అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు.




