Weekend OTT : ఈ వీకెండ్ OTT జాతర.. మిస్ అయితే లాస్.!

Weekend OTT : వారం ముగిసి వీకెండ్ వచ్చేసింది. ఈ శని, ఆదివారాల్లో ఇంట్లోనే కూర్చుని హాయిగా సినిమాలు, సిరీస్‌లు చూస్తూ గడపాలనుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు

G Krishna
Published on: 1 Aug 2026 1:17 PM IST
Weekend-OTT
X

Weekend-OTT

Weekend OTT : వారం ముగిసి వీకెండ్ వచ్చేసింది. ఈ శని, ఆదివారాల్లో ఇంట్లోనే కూర్చుని హాయిగా సినిమాలు, సిరీస్‌లు చూస్తూ గడపాలనుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆప్షన్స్ తీసుకొచ్చాయి. బాలీవుడ్ మసాలా సినిమాలు, తెలుగు సైకలాజికల్ డ్రామాలు, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ల నుంచి ఇంటర్నేషనల్ యానిమేటెడ్ అడ్వెంచర్ల వరకు.. ఈ వారాంతంలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రధాన ప్రాజెక్టుల వివరాలు మీకోసం..

లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాలు

వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే, మనీష్ పాల్ కాంబినేషన్‌లో వస్తున్న ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' జూలై 31 నుంచి ZEE5 లో అందుబాటులోకి వచ్చింది. పెళ్లి కాస్తా విడాకుల వరకు వెళ్లి, ఆ తర్వాత విదేశాల్లో సరికొత్త ప్రేమ కథ మొదలయ్యాక హీరో జీవితంలో ఎలాంటి గందరగోళం మొదలైందనేది ఈ సినిమా కథ. ఇక సత్యదేవ్ నటించిన మైండ్ బెండింగ్ తెలుగు సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక పాతకాలపు పెద్దరికం ఉన్న కుటుంబంలో జరిగే వింత సంఘటనలు, అనుమానాలు, హీరో మనసులోని ఘర్షణ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

అలాగే ఒక నిజమైన కథ ఆధారంగా తీసిన తమిళ ఎమోషనల్ ఫిల్మ్ 'నూరు సామి' ZEE5 లో ప్రసారం అవుతోంది. కష్టాల్లో ఉన్న ఒక తల్లి, కొడుకు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేది ఇందులో చూపించారు. ఇదే ZEE5 లో విడుదలైన మలయాళ డ్రామా 'బాలన్ – ది బాయ్' కూడా తల్లి కొడుకుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాలా అందంగా ఆవిష్కరించింది.

నవ్వించే కామెడీలు.. యానిమేటెడ్ థ్రిల్స్

బాక్సాఫీస్ దగ్గర అలరించిన స్పోర్ట్స్ కామెడీ సీక్వెల్ 'గట్ట కుస్తీ 2' నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. వీర, కుస్తీ ప్లేయర్ కీర్తి జంటగా మళ్లీ నవ్వించేందుకు వచ్చేశారు. తల్లిదండ్రులుగా మారిన తర్వాత ఫ్యామిలీ బాధ్యతలతో పాటు రింగ్‌లో కుస్తీని ఎలా మేనేజ్ చేశారో ఇందులో వినోదాత్మకంగా చూపించారు. మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా రూపొందించిన యానిమేటెడ్ ఫిల్మ్ 'ది లెజెండ్ ఆఫ్ కర్ణ' సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనాథగా పెరిగిన చిన్నతనం నుంచి గొప్ప వీరుడిగా మారడం, అర్జునుడితో పోరాటం , కర్ణుడి త్యాగాలను ఇందులో అద్భుతంగా డిజైన్ చేశారు. బాట్‌మ్యాన్ ఫ్యాన్స్ కోసం వచ్చిన 'బాట్‌మ్యాన్: కేప్డ్ క్రుసేడర్ సీజన్ 2' ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

యాక్షన్ థ్రిల్లర్స్ & మైండ్ బ్లోయింగ్ రియాలిటీ షోలు

గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే అతిపెద్ద రియాలిటీ షో 'ప్లేగ్రౌండ్ సీజన్ 5' ఆగస్టు 1 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రారంభమైంది. కొత్త జట్లు, క్రేజీ మెంటార్ల మధ్య ఉండే గట్టి పోటీ ఇందులో చూడవచ్చు. అలాగే జోయి సల్దానా నటిస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ సిరీస్ 'స్పెషల్ ఆప్స్: లయన్‌నెస్ సీజన్ 3' ఆగస్టు 2 నుంచి ప్రైమ్ వీడియోలో రాబోతోంది. సీక్రెట్ మిషన్లు, ఉగ్రవాదులతో పోరాడే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కథతో ఇది సాగుతుంది.

వీటితో పాటు భోజ్‌పురి సినీ పరిశ్రమలోని పెద్ద స్టార్ల నిజ జీవితం, వాళ్ల కెరీర్ , అకౌంట్స్ వెనుక ఉన్న విషయాలను చూపించే 'భోజ్‌పురి బవాల్' అనే రియాలిటీ సిరీస్ ఆగస్టు 2 నుంచి జియోహాట్‌స్టార్‌లో రాబోతోంది. ఈ వీకెండ్‌కు మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story