Weekend OTT: ఈ వీకెండ్ మిస్ కాకూడని టాప్ రిలీజ్‌లు.!

Weekend OTT: ఈ వారాంతం (జూలై 10 నుండి జూలై 12 వరకు) ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త ఓటీటీ కంటెంట్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో,

G Krishna
Published on: 11 July 2026 1:05 PM IST
weekend-ott
X

weekend-ott

Weekend OTT: ఈ వారాంతం (జూలై 10 నుండి జూలై 12 వరకు) ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త ఓటీటీ కంటెంట్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 , సోనీలివ్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వేర్వేరు జానర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థ్రిల్లర్స్, కామెడీ, డ్రామాతో కూడిన ఈ వీకెండ్ వాచ్‌లిస్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

జూలై 10న విడుదలైన చిత్రాలు

ఈ శుక్రవారం నుండే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫాంలలో అందుబాటులోకి వచ్చాయి. బాలీవుడ్ సీనియర్ నటులు సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, తిలోత్తమ షోమ్ , దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన కోర్టు రూమ్ థ్రిల్లర్ మూవీ 'ఇక్కా' (Ikka) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తానే శిక్ష పడేలా చేసిన ఒక వ్యక్తి తరఫున వాదించాల్సిన పరిస్థితి ఒక ప్రముఖ న్యాయవాదికి ఎదురైనప్పుడు జరిగే తీవ్రమైన చట్టపరమైన, వ్యక్తిగత పోరాటమే ఈ చిత్ర కథాంశం.

అలాగే జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ డార్క్ కామెడీ చిత్రం 'పరిమళ అండ్ కో' (Parimala & Co) జీ5లో అందుబాటులోకి వచ్చింది. ఒక సమస్యాత్మకమైన పొరుగు వ్యక్తి అనుమానాస్పద మృతి తర్వాత ఒక సాధారణ కుటుంబం జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అనే ఆసక్తికర కథనంతో ఇది తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మరో సస్పెన్స్ చిత్రం 'ద పారడైజ్ మర్డర్స్' (The Paradise Murders). ఒక లగ్జరీ హనీమూన్ ట్రిప్‌లో ఊహించని విధంగా ఒక అతిథి మరణించడంతో అది కాస్తా మర్డర్ ఇన్వెస్టిగేషన్‌గా మారి, దాగి ఉన్న రహస్యాలను ఎలా బయటపెట్టిందనేది దీని కథ. కబడ్డీ క్రీడ నేపథ్యంలో ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ 'బాల్టి' (Balti) సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్ వార్స్, క్రిమినల్ వరల్ట్ లో చిక్కుకున్న నలుగురు ఛాంపియన్ కబడ్డీ ఆటగాళ్ల స్నేహం ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంది అనేది ఇందులో చూపించారు.

జూలై 11న స్ట్రీమింగ్ అవుతున్న స్పెషల్ షోలు

శనివారం రోజున కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చాయి. ఒక వివాహిత జంట జీవితంలో తలెత్తే ఊహించని అపార్థాలు, వాటి వల్ల వచ్చే నవ్వుల హంగామాతో సాగే ఫ్యామిలీ కామెడీ సిరీస్ 'పతి పత్ని ఔర్ వో దో' (Pati Patni Aur Woh Do) జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ మిస్టరీ కంటెంట్‌ను ఇష్టపడే వారి కోసం జి సంగ్ నటించిన 'ద అపార్ట్‌మెంట్ జాబ్' (The Apartment Job) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒక మాజీ గ్యాంగ్ లీడర్, ఒక యంగ్ లాయర్ కలిసి పెద్ద దోపిడీకి ప్లాన్ చేసే క్రమంలో ఒక భారీ అవినీతి స్కామ్‌ను ఎలా వెలికితీశారు అనేది ఈ సిరీస్ ప్రత్యేకత. యానిమే (Anime) ప్రియుల కోసం వన్‌పీస్ క్యారెక్టర్ 'నామి' ప్రధాన పాత్రలో సాగే అడ్వెంచర్ సిరీస్ 'వన్ పీస్ హీరోయిన్స్' (ONE PIECE HEROINES) కూడా నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

జూలై 12న రాబోతున్న చిత్రాలు

ఆదివారం కూడా ఓటీటీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది. జె. కె. సిమన్స్, టైటస్ వెలివర్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ద వెస్టీస్' (The Westies) అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. 1980ల నాటి న్యూయార్క్ నేపథ్యంలో ఐరిష్-అమెరికన్ క్రైమ్ ఫ్యామిలీ, ప్రత్యర్థి మాఫియా గ్రూపులతో , అంతర్గత అధికార పోరాటాలతో జరిపిన యుద్ధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇవే కాకుండా ఇద్దరు విడిపోయిన బెస్ట్ ఫ్రెండ్స్ ఒక సెలబ్రిటీ వెడ్డింగ్ ఆర్గనైజ్ చేయడానికి మళ్లీ కలిసినప్పుడు వారి పాత గాయాలు, స్నేహం చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామా 'సుసానా అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి' (Susana and Elvira: No Plan B) నెట్‌ఫ్లిక్స్‌లో ఆదివారం నుండి అందుబాటులోకి రానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story