Nagabandham: ఓటీటీలోకి వచ్చేస్తున్న విరాట్ కర్ణ 'నాగబంధం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nagabandham: టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం'.
Nagabandham: ఓటీటీలోకి వచ్చేస్తున్న విరాట్ కర్ణ 'నాగబంధం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nagabandham: టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తక్కువ సమయంలోనే ఓటీటీ బాట పట్టేందుకు సిద్ధమైంది. సినిమా థియేట్రికల్ రన్ ముగియకముందే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లాక్ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాగబంధం' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన సుమారు 3 నుండి 4 వారాల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. హిందీ వెర్షన్ విడుదలపై త్వరలోనే స్పష్టత రానుంది.
భారీ తారాగణం … కథాంశం
ఈ చిత్రంలో విరాట్ కర్ణ సరసన నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, దక్ష నాగర్కర్, రిషభ్ సాహ్ని తదితరులు కీలక పాత్రలు పోషించారు. నికి స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి జునైద్ కుమార్ - అభే సంయుక్తంగా సంగీతం అందించారు. పురాతన విష్ణు ఆలయాలు, 'నాగబంధం' రహస్యాలు, బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే ఈ మైథలాజికల్ అడ్వెంచర్ కథ థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.




