Thadayam Web Series: భయంకరమైన 77 సీరియల్ మర్డర్స్.. ఆ రక్తపు గుర్తు వెనుక అసలు కిల్లర్ ఎవరు.?

Thadayam Web Series : ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన చుట్టూ

G Krishna
Published on: 1 May 2026 2:21 PM IST
Thadayam
X

Thadayam

Thadayam Web Series : ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే రియల్ క్రైమ్ స్టోరీలను చూసేందుకు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. వాస్తవ సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని చీకటి కోణాలను వెండితెరపై లేదా డిజిటల్ స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు కలిగే ఉత్కంఠే వేరు. సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన, వెన్నులో వణుకు పుట్టించే యదార్థ గాథ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘తడయం’.

ఆంధ్ర - తమిళ సరిహద్దులో గజగజ వణికించిన హంతకులు

ఈ వెబ్ సిరీస్ 1990వ దశకంలో ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్లూరు సమీపంలో ఉన్న పొడతూర్‌‌పేట అనే ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. 1995 కాలంలో అక్కడ జరిగిన వరుస హత్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 77 హత్యలు ఒకే తరహాలో (సీరియల్ మర్డర్స్) జరగడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

ఒకే ప్యాట్రన్.. వింతైన కిల్లర్ అలవాట్లు

ఈ హత్యల వెనుక ఉన్న కిల్లర్స్ ఒకే రకమైన పద్ధతిని అనుసరించేవారు. ఊరికి దూరంగా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే దంపతులను మాత్రమే వీరు టార్గెట్ చేసేవారు. భార్యాభర్తలను అతి దారుణంగా హతమార్చిన తర్వాత, వారు మరే ఇతర విలువైన వస్తువులను ముట్టుకునేవారు కాదు. కేవలం మగవారి నడుముకు ఉన్న మొలతాడును (గొలుసు), ఆడవారి మెడలోని మంగళసూత్రాన్ని మాత్రమే తీసుకుని వెళ్లేవారు. వీటన్నింటికీ మించి, హత్యా స్థలంలో బాధితుల రక్తంతో "?" (ప్రశ్నార్థకం గుర్తు) రాసి వెళ్లడం ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అసలు వారు ఆ వస్తువులే ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ ప్రశ్నార్థకం గుర్తు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనేది పోలీసులకు సైతం అంతుచిక్కని మిస్టరీగా మారింది.

సముద్రఖని పవర్‌ఫుల్ నటన.. సాంకేతిక నిపుణుల ప్రతిభ

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు , దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. తనదైన సహజ సిద్ధమైన నటనతో ఆయన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ప్రాణం పోశారు. నవీన్ కుమార్ పళనివేల్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయగా, అజయ్ కృష్ణ దీనిని నిర్మించారు. శివదా, సుందర్ పాండియన్, రాజ్ తిరందాస్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలలో మెరిశారు. బాధితులను చంపే విధానం నుండి, పోలీసుల విచారణ వరకు ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా ఎంగేజింగ్‌గా, ఊహించని ట్విస్టులతో మలిచారు.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది.?

తమిళంలో రూపొందిన ఈ 'తడయం' వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ మీరు ఈ వారాంతంలో ఏదైనా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటే, 'తడయం' మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఆ 77 హత్యల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story