Teach You A Lesson Review: పేపర్ లీక్‌ల వేళ.. వైరల్ అవుతున్న వెబ్ సిరీస్!
Teach You A Lesson Review: ప్రస్తుతం దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన పేపర్ లీకేజీలు, వివాదాలు నడుస్తున్న వేళ.. సరిగ్గా అదే విద్యా వ్యవస్థలోని లోపాలను..
Teach You A Lesson Review: ప్రస్తుతం దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన పేపర్ లీకేజీలు, వివాదాలు నడుస్తున్న వేళ.. సరిగ్గా అదే విద్యా వ్యవస్థలోని లోపాలను, విద్యార్థుల ప్రవర్తనను ఎండగడుతూ వచ్చిన ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ 'మస్ట్ వాచ్' (తప్పక చూడాల్సిన) లిస్ట్‌లో చేరిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న 'బెర్లిన్ 2' వంటి పాపులర్ సిరీస్‌లను సైతం వెనక్కి నెట్టి ఇది నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) నుండి కూడా మైండ్ బ్లోయింగ్ రేటింగ్ లభించింది.
ఇంతకీ ఈ సిరీస్ కథాంశం ఏంటి.?
పాఠశాలల్లో ఉపాధ్యాయుల హక్కులు బలహీనపడటం, విద్యార్థులు, వారి కుటుంబాల నుండి టీచర్లు ఎదుర్కొంటున్న వేధింపుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే 'ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో' (ERPB) అనే ఒక ప్రత్యేక విభాగం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. హద్దులు మీరి ప్రవర్తించే విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ బ్యూరో ఎలా కఠినంగా శిక్షిస్తుందనేదే కథ. పాఠశాలల్లో తోటి విద్యార్థులను వేధించే 'బుల్లీయింగ్' బ్యాచ్‌లకు బుద్ధి చెప్పడం, సమాజంలో ఉండే తప్పుడు పవర్ పాలిటిక్స్‌ను బట్టబయలు చేయడం , ఉపాధ్యాయులకు సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి ఎలా తెచ్చారనే అంశాలను ఇందులో ఎంతో ఆసక్తికరంగా చూపించారు.
సిరీస్ పేరు , నటీనటుల వివరాలు
మనం మాట్లాడుకుంటున్న ఈ యాక్షన్ స్కూల్ డ్రామా థ్రిల్లర్ సిరీస్ పేరు 'టీచ్ యూ ఎ లెసన్' (Teach You A Lesson). ఇదొక సౌత్ కొరియన్ (K-Drama) సిరీస్. ప్రముఖ దర్శకుడు హాంగ్ జోంగ్-చాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు లీ నామ్-క్యూ, కిమ్ దా-హీ , మూన్ జోంగ్-హో కథను అందించారు. ఇందులో కిమ్ ము-యెయోల్, లీ సుంగ్-మిన్, జిన్ కీ-జూ , ప్యో జి-హూన్ ప్రధాన పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు.
నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్-1.. ఐఎమ్‌డీబీ రేటింగ్స్ ఊచకోత
ఈ కే-డ్రామా జూన్ 5వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ ఇండియా లిస్ట్‌లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 'ది వండర్‌ఫుల్స్', 'బెర్లిన్' వంటి పాపులర్ సిరీస్‌లను దాటుకుంటూ దూసుకెళ్తోంది. దీనికి తోడు IMDb లో ఈ సిరీస్‌కు 8.5/10 వంటి అద్భుతమైన రేటింగ్ లభించింది. అటు ప్రేక్షకుల నుండి, ఇటు సినీ విమర్శకుల (క్రిటిక్స్) నుండి ఈ సిరీస్‌కు భారీ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. విద్యా వ్యవస్థలోని చీకటి కోణాలను ఇష్టపడే యాక్షన్ థ్రిల్లర్ ప్రియులు అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది.




