ఓటీటీలోకి వచ్చేసిన సత్య క్రేజీ కామెడీ థ్రిల్లర్ ‘జెట్లీ’!
Jetlee: టాలెంటెడ్ కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ ఏవియేషన్ కామెడీ థ్రిల్లర్ ‘జెట్లీ’.
ఓటీటీలోకి వచ్చేసిన సత్య క్రేజీ కామెడీ థ్రిల్లర్ ‘జెట్లీ’!
Satya: టాలెంటెడ్ కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ ఏవియేషన్ కామెడీ థ్రిల్లర్ ‘జెట్లీ’. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీతో టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో మే ఒకటవ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, థియేటర్ రన్ ముగిసిన నెల రోజుల్లోపే ఈ క్రేజీ రైడ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
జియో హాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్
ఈ రోజు (మే 25) నుండి ‘జెట్లీ’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. కన్నడ, తమిళం , మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన హోమ్ ఆడియన్స్‌కు వీకెండ్స్ లేదా ఖాళీ సమయాల్లో చూసేందుకు ఇదొక మంచి ఆప్షన్‌గా మారనుంది. ఓటీటీలో ఇలాంటి కామెడీ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో డిజిటల్ వేదికపై ఈ చిత్రం మంచి వ్యూస్‌ను రాబట్టే అవకాశం ఉంది.
విమానం సెట్‌లో సాగే క్రేజీ కన్ఫ్యూజన్ డ్రామా..
దుబాయ్ నుండి కొచ్చి వచ్చే ఒక ప్యాసింజర్ విమానం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. గతమంతా మర్చిపోయిన వేద వ్యాస్ అలియాస్ జాన్ సీనా (సత్య) అనే వ్యక్తి చుట్టూ, ఆ ఫ్లైట్‌లో జరిగే ఒక పొలిటికల్ కాన్‌స్పిరసీ చుట్టూ కథను చాలా వినోదాత్మకంగా మలిచారు. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్ , కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించారు.
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ చేశారు. కాల భైరవ అందించిన డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సత్య మార్క్ కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. థియేటర్లలో చూడలేకపోయిన మాస్ , కామెడీ లవర్స్ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఈ ‘మ్యాడ్ టర్బులెంట్ రైడ్’ను హ్యాపీగా స్ట్రీమ్ చేయవచ్చు.




