OTT Release : కూతురు మిస్సింగ్.. వరుస హత్యలు.. ఈ థ్రిల్లర్ ఇప్పుడు మరో ఓటీటీలో.!
OTT Release : వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో, ఆమె సొంత నిర్మాణంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
s-saraswathi
OTT Release : వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో, ఆమె సొంత నిర్మాణంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ఎస్.సరస్వతి’. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) లో జూన్ 4వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
అసలు కథేంటంటే?
లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) అనే ఒక అనాథ మహిళ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంటుంది. ఒకరోజు (ఆగస్టు 15న) తన కూతురు ఎస్.సరస్వతిని ఎప్పటిలాగే స్కూల్‌లో దించి డ్యూటీకి వెళ్తుంది. కానీ సాయంత్రం కూతుర్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చేసరికి ఆ పాప స్కూల్‌లో కనిపించదు. ఈ విషయమై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే, అసలు సరస్వతి అనే పేరుతో లక్ష్మి చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి చదవడం లేదని బాంబు పేలుస్తారు.
ట్విస్టుల మీద ట్విస్టులు..
కూతురు కనిపించకుండా పోయిన మరుసటి రోజే లక్ష్మి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతుంది. తన పాపను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారని, ఆ శవాన్ని ఫలానా చోట పాతిపెట్టానని పోలీసులకు చెబుతుంది. కానీ పోలీసులు లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూడగా అక్కడ ఎలాంటి శవం లభించదు. ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేస్తారు. దీనిపై ఆమె ప్రముఖ న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయంతో కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవనే కారణంతో కేసు కొట్టేస్తారు.
హత్యల పరంపర.. ఆ తర్వాత ఏమైంది?
న్యాయం జరగని చోట లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన కూతుర్ని చంపారనే కోపంతో ఒక జడ్జిని, ఒక ఐఏఎస్ అధికారిని, ఒక పోలీస్‌ను వరుసగా హత్య చేస్తుంది. అసలు ఎలాంటి సాక్ష్యం లేని కేసులో లక్ష్మి వీరందరినీ ఎందుకు టార్గెట్ చేసింది? అసలు లక్ష్మి గతం ఏంటి? ఆమె కూతురు నిజంగానే చనిపోయిందా లేదా ఇదంతా ఒక సైకలాజికల్ ప్లానా? అనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. థియేటర్లలో, ప్రైమ్ వీడియోలో ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారు జూన్ 4 నుంచి ఈటీవీ విన్‌లో చూసి ఆస్వాదించవచ్చు.




