Roslin web series: OTTలో దుమ్మురేపుతున్న కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్..!
Roslin web series: మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ సమర్పణలో వచ్చిన కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్'.
Roslin web series: OTTలో దుమ్మురేపుతున్న కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్..!
Roslin web series: భారతీయ చిత్ర పరిశ్రమలో 'ది బెస్ట్' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు 'దృశ్యం'. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ తదితర భాషల్లో రీమేక్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ ఫ్రాంచైజీ ప్రతి ఒక్కరినీ థ్రిల్ చేసింది. సీటు అంచున కూర్చోబెట్టేలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన మరో మైండ్ బ్లోయింగ్ క్రియేషన్ ఇప్పుడు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
జీతూ జోసెఫ్ నిర్మాణంలో, సుమేష్ నందకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అత్యంత ఆసక్తికరమైన వెబ్ సిరీస్ **'రోస్లిన్'. ఆద్యంతం ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని మైండ్ బెండింగ్ ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది.
ఈ కథ అంతా ఒక 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ప్రతిరోజూ రాత్రి భయంకరమైన కలలు వస్తుంటాయి. కలలో ఒక అజ్ఞాత వ్యక్తి తనను నిరంతరం వెంబడిస్తున్నట్లు, తను ప్రాణాలతో దక్కకుండా చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంటుంది. ఆ భయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ, వారు దానిని తేలికగా తీసుకుని సైకలాజికల్ భ్రమ అని కొట్టిపారేస్తారు. కానీ, ఒకరోజు అందరికీ ఊహించని షాక్ తగులుతుంది. ఆ అమ్మాయి కలలో ప్రతిరోజూ కనిపించే ఆ భయానక వ్యక్తి... నేరుగా వారి ఇంటికే ఒక అతిథిగా వస్తాడు.
కలలో కనిపించే వ్యక్తి నిజంగానే ఇంటికి వచ్చాడా లేక అదంతా ఆమె చదువుతున్న ఒక పుస్తకం వల్ల కలుగుతున్న భ్రమా?,. ఇంటికి వచ్చిన ఆ అసలు అతిథి ఎవరు? ఆయన వెనుక ఉన్న రహస్యం ఏంటి?, ఆ 17 ఏళ్ల అమ్మాయికి, ఈ విచిత్ర సంఘటనలకు ఉన్న లింక్ ఏంటి?. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దక్కాలంటే 'రోస్లిన్' సిరీస్ చూడాల్సిందే.
సీనియర్ నటుడు వినీత్, నటి మీనా భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. అమ్మాయిగా సంజనా దీపు తన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్ 25 నుంచి 35 నిమిషాల నిడివితో చాలా స్పీడ్‌గా సాగిపోతుంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ ఈ 'రోస్లిన్' సిరీస్‌ను అస్సలు మిస్ కావద్దు.




