OTT: దృశ్యం ద‌ర్శ‌కుడి నుంచి మ‌రో సూప‌ర్ థ్రిల్ల‌ర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

OTT: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జీతు జోసెఫ్.

Mokshith
Published on: 12 April 2026 11:45 AM IST
OTT
X

OTT: దృశ్యం ద‌ర్శ‌కుడి నుంచి మ‌రో సూప‌ర్ థ్రిల్ల‌ర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

OTT: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జీతు జోసెఫ్. ఆయన తెరకెక్కించిన దృశ్యం సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ద‌ర్శ‌కుడి నుంచి ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమా వ‌చ్చింది.

దృశ్యం సినిమా కథన శైలికి దగ్గరగా ఉండే విధంగా రూపొందించిన వెబ్ సిరీస్‌ రోస్లిన్ ఓటీటీలోకి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సిరీస్‌కు దర్శకుడిగా సుమేష్ నందకుమార్ పని చేశారు. అయితే మొత్తం కథ నిర్మాణం, స్క్రీన్‌ప్లే రూపకల్పనలో జీతు జోసెఫ్ భాగస్వామ్యం ఉండటం వల్ల ఈ సిరీస్‌లో కూడా అదే ఉత్కంఠ కనిపిస్తుంది.

ఓటీటీలో పలు భాషల్లో అందుబాటులో

గత నెలలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన రోస్లిన్ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల కోసం కూడా దీనిని అందుబాటులో ఉంచారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీ భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది.

ఈ సినిమా క‌థేంటంటే.?

ఈ సిరీస్ కథ ఒక ఆసక్తికరమైన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. “కలలో కనిపించే సంఘటనలు నిజ జీవితంలో జరిగితే?” అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. కథలో ఒక 17 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్ర. ఆమెకు తరచూ ఒకే రకమైన కల వస్తుంటుంది. ఆ కలలో ఒక పచ్చ కళ్లున్న వ్యక్తి తనను వెంబడిస్తూ, చంపాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ కలలు ఆమెను తీవ్రంగా భయపెడతాయి. మొదట ఇవి కేవలం కలలేనని భావించినా, ఒక రోజు అనూహ్యమైన ఘటన జరుగుతుంది. అదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

కలలో కనిపించిన వ్యక్తి నిజంగా ఇంటికి రావడం

ఒక రోజు ఆ అమ్మాయి ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తిని చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే అతడే ఆమె కలల్లో కనిపించే వ్యక్తి. దీంతో ఆ అమ్మాయి తీవ్ర భయంతో కంగారు పడుతుంది. తనకు ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంది. పరిస్థితి అర్థం కాక తల్లిదండ్రులు ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి కథ మరింత మలుపులు తిరుగుతుంది.

ఆమె చదువుతున్న ఒక పుస్తకం కారణంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయా? కలల్లో కనిపించే వ్యక్తి నిజంగా ఎవరు? ఆ అమ్మాయి జీవితానికి అతనికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే రోస్లిన్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

నటీనటులు

ఈ వెబ్ సిరీస్‌లో వినీత్, మీనా వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తూ కథకు భావోద్వేగాన్ని తీసుకొచ్చారు. సస్పెన్స్‌తో పాటు మానసిక ఉద్రిక్తత, కుటుంబ భావోద్వేగాలు, క్రైమ్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఈ సిరీస్ థ్రిల్లర్ జానర్ అభిమానులకు మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story