Ott Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ. 250 కోట్ల సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే!

Ott Release: మాస్ మహరాజా రవితేజ 'ఇరుముడి' సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లతో థియేటర్లలో దూసుకుపోతోంది.

Gagan kumar
Published on: 10 Sept 2026 10:24 AM IST
Ott Release
X

Ott Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ. 250 కోట్ల సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే!

Irumudi OTT release date: బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న మాస్ మహరాజా రవితేజ ఇరుముడి’ చిత్రం థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్, భావోద్వేగపూరితమైన తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు తోడు శక్తివంతమైన అయ్యప్ప స్వామి నేపథ్యం కలగలసి ప్రేక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది.

మూడు వారాలు గడిచినా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం విశేషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రేక్షకులు ట్రాక్టర్లపై వచ్చి మరీ ఈ సినిమాను వీక్షిస్తుండటం దీనికి వస్తున్న ప్రభంజనానికి నిదర్శనం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, కూతురి పాత్రలో నక్షత్ర తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తమ పాత్రల్లో ఒదిగిపోగా, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన స్వరాజ్యాలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగుతున్న తరుణంలో, ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ఫ్యాన్సీ రేటుతో ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకుంది. సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి తెచ్చే నిబంధన ప్రకారం సెప్టెంబర్ 18 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని భావించారు.

అయితే, థియేటర్లలో ఇంకా తగ్గని క్రేజ్, భారీ కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఓటీటీ విడుదలను మరికొన్ని రోజులు వాయిదా వేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 25, లేదా అక్టోబర్ 2న కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.దీంతో ఈ డివోషినల్ బ్లాక్‌బస్టర్‌ను డిజిటల్ స్క్రీన్‌పై చూడటానికి ఓటీటీ ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story