OTT: ముంబైని గడగడలాడించిన ఆ సైకో కిల్లర్ ఎవరు.? ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ
OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న దల్ దల్ అనే వెబ్ సిరీస్ ఇదే కోవలోకి వస్తుంది.
OTT: ముంబైని గడగడలాడించిన ఆ సైకో కిల్లర్ ఎవరు.? ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ
OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న దల్ దల్ అనే వెబ్ సిరీస్ ఇదే కోవలోకి వస్తుంది.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ కథల్లో చివరి ఎపిసోడ్ వరకూ కిల్లర్ ఎవరో చెప్పరు. అదే సస్పెన్స్‌గా ఉంటుంది. అయితే ఈ సిరీస్‌లో మాత్రం కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. రెండో ఎపిసోడ్‌కే సీరియల్ కిల్లర్ ఎవరన్నది చూపిస్తారు. అతను ఎలా హత్యలు చేస్తున్నాడు, ఎలా ప్లాన్ చేస్తున్నాడు అన్నది కూడా ప్రేక్షకులకు చూపిస్తారు. అయినప్పటికీ కథలో ఉత్కంఠ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే పోలీసులు అతన్ని ఎలా పట్టుకుంటారు అన్నదే అసలు కథగా కొనసాగుతుంది.
కథేంటంటే.?
కథ ముంబై నగరంలో జరుగుతుంది. అక్కడ వరుసగా హత్యలు జరగడం ప్రారంభమవుతుంది. అన్ని హత్యలు ఒకే విధంగా జరుగుతుండటంతో ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అని పోలీసులు అర్థం చేసుకుంటారు. బాధితులను చంపే ముందు ఆ కిల్లర్ వారిని తీవ్రంగా హింసిస్తాడు. అంతేకాదు, అతను చాలా జాగ్రత్తగా హత్యలు చేయడంతో పోలీసులకు ఒక్క చిన్న ఆధారం కూడా దొరకదు. దీంతో నగరంలో భయాందోళనలు పెరుగుతాయి.
కేసును సవాల్‌గా తీసుకున్న యువ డీసీపీ
ముంబై నగరానికి చాలా చిన్న వయస్సులోనే డీసీపీగా బాధ్యతలు చేపట్టిన రీటా ఫెరారియా ఈ కేసును సవాల్‌గా తీసుకుంటుంది. వరుసగా జరుగుతున్న హత్యలను ఆపేందుకు ఆమె ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభిస్తుంది. అయితే సీరియల్ కిల్లర్ మాత్రం పోలీసులను మోసం చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటాడు. చివరికి అతని దారుణం మరింత పెరిగి పోలీస్ విభాగానికి చెందిన వ్యక్తినే హత్య చేస్తాడు. దీంతో కేసు మరింత సీరియస్ అవుతుంది.
‘దల్ దల్’ వెబ్ సిరీస్‌కు అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు సహా పలు భాషల్లో కూడా అందుబాటులో ఉంది.




