OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..సస్పెన్స్ ట్విస్టులతో మైండ్ బ్లాక్

OTT: ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కోసం ఒక క్రేజీ తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి వచ్చింది.

Naresh.k
Published on: 18 July 2026 11:54 AM IST
OTT
X

OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..సస్పెన్స్ ట్విస్టులతో మైండ్ బ్లాక్

Gedela Raju Kakinada Taluka: వీకెండ్ వచ్చేసిందంటే చాలు.. ఓటీటీ లవర్స్ అంతా ఏయే కొత్త సినిమాలు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చాయా అని వెతకడం కామన్. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్యూ కట్టాయి. సమంత ‘మా ఇంటి బంగారం’, సాయిపల్లవి ‘ఏక్ దిన్’, వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, కన్నడ స్టార్ దర్శన్ ‘ద డెవిల్’ వంటి విభిన్న చిత్రాలు ఇప్పటికే వినోదాన్ని పంచుతున్నాయి.

అయితే, వీటన్నింటి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి ల్యాండ్ అయిపోయింది. థియేటర్లలో మిస్ అయిన వారికి హోమ్ థియేటర్లలో ఫుల్ వినోదాన్ని ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. గత ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆ సినిమానే 'గేదెల రాజు.. కాకినాడ తాలుకా'. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ,నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ఈ రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో భగవంత్ రాజు అనే ఒక పేరు మోసిన రౌడీ షీటర్ ఉంటాడు. ఎలాగైనా రాజకీయంగా బలోపేతం కావాలని కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతాడు. అయితే, అదే కార్పొరేటర్ సీటు కోసం దుర్గ అనే మరో వ్యక్తి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంటుంది.


అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో ఒక రోజు రాత్రి భగవంత్ రాజు దారుణ హత్యకు గురవుతాడు. దాంతో అనుమానాలన్నీ సహజంగానే ప్రత్యర్థి దుర్గపైకి వెళ్తాయి. కానీ, నిజంగానే భగవంత్ రాజును చంపింది దుర్గనేనా? లేక ఈ పొలిటికల్ మర్డర్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, తెరవెనుక శక్తులు ఎవరు? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో విలన్ పాత్ర డిజైన్ చేసిన విధానం, సదరు నటుడి పర్ఫార్మెన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలిచాయి. కథ సింపుల్‌గానే అనిపించినా, దర్శకుడు చైతన్య మోటూరి రాసుకున్న స్క్రీన్ ప్లే మరియు ఉత్కంఠ రేకెత్తించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉంటాయి. రఘు కుంచెతో పాటు వికాస్ ముప్పాల, టీనా శ్రావ్య, మౌనిక, సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ యాక్షన్ డ్రామాను ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వారికి 'గేదెల రాజు.. కాకినాడ తాలుకా' ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆహా లేదా ప్రైమ్ వీడియో ఓపెన్ చేసి వాచ్ చేసేయండి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story