Jio OTT Plans : జియో సంచలనం.. రూ. 550, రూ. 2000 ధరల్లో కొత్త OTT పాస్ ప్లాన్లు..!

Jio OTT Plans : భారతీయ టెలికాం రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం వినోద విందును మరింత వేగవంతం చేస్తూ రెండు కొత్త ప్రీపెయిడ్

G Krishna
Published on: 8 Aug 2026 6:07 PM IST
Jio OTT Plans
X

Jio OTT Plans

Jio OTT Plans : భారతీయ టెలికాం రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం వినోద విందును మరింత వేగవంతం చేస్తూ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 550 , రూ. 2,000 ధరలతో రూపొందించిన ఈ ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జియో చందాదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడంతో పాటు ఒకే ప్లాన్‌ కింద వినోద ప్రపంచాన్ని చేరవేసే లక్ష్యంతో కంపెనీ ఈ 'OTT పాస్' కేటగిరీని విస్తరించింది. ఇప్పటికే మార్కెట్లో రూ. 200 కే లభిస్తున్న OTT పాస్‌కు లభిస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారుల విభిన్న అవసరాలకు తగ్గట్లుగా ఈ రెండు కొత్త ప్లాన్‌లను డిజైన్ చేశారు.

రూ. 550 ప్లాన్ విశేషాలు.. 84 రోజుల పాటు పరిమితి లేని వినోదం

జియో అందిస్తున్న రూ. 550 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల సుదీర్ఘ కాలపరిమితితో వస్తుంది. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు మొత్తం 90GB 4G డేటా లభిస్తుంది. అయితే, ఇది ప్రధానంగా డేటా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్-ఆన్ వోచర్ కావడం వల్ల, మీ వద్ద కనీసం 3 నెలలు లేదా 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న ఏదైనా ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి.

ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్స్ట్, ఈటీవీ విన్, కంచ లంకా, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ , జియోటీవీ వంటి ఏకంగా 16 రకాల ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల పాటు ఉచితంగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా, జియోటీవీ మొబైల్ యాప్ ద్వారా 1,000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లను కూడా ఎలాంటి అదనపు రుసుము లేకుండా చూడవచ్చు. ఒకవేళ మీ వద్ద ఉన్న బేస్ ప్లాన్‌లో అపరిమిత 5G సదుపాయం లేకపోతే, ఈ ప్లాన్ రీఛార్జ్ చేయడంతోనే మీ నెట్‌వర్క్ 5G కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఫలితంగా మీ బేస్ ప్లాన్ గడువు ముగిసే వరకు లేదా 84 రోజుల పాటు హైస్పీడ్ 5G నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.

రూ. 2000 ప్లాన్ విశేషాలు.. ఏడాది పొడవునా డేటా, OTT ప్రయోజనాలు

ఏడాది పొడవునా పదే పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా ఒకేసారి నిశ్చింతగా ఉండాలనుకునే ప్రైమ్ వినియోగదారుల కోసం జియో రూ. 2,000 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ బంపర్ ఆఫర్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 365GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇప్పటికే వార్షిక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ డేటా, వినోద అవసరాల కోసం ఈ ప్యాక్‌ను యాడ్-ఆన్‌గా వాడుకోవచ్చు.

ఈ రూ. 2000 ప్లాన్‌తో కూడా రూ. 550 ప్లాన్‌లో లభించే అన్ని అగ్రశ్రేణి OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు బండిల్ చేయబడి వస్తాయి. ఇందులో యూట్యూబ్ ప్రీమియం నుండి మొదలుకొని అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఈటీవీ విన్ సహా అనేక ప్రాంతీయ ఓటీటీలు , 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు భాగమై ఉన్నాయి. బేస్ ప్లాన్‌లో 5G లేని వినియోగదారులను ఈ ప్లాన్ స్వయంచాలకంగా 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేస్తుంది. ఫలితంగా డేటా పరిమితి గురించిన ఆందోళన లేకుండా, ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు , ప్రత్యక్ష క్రీడా వినోదాన్ని 5G వేగంతో డిజిటల్ స్క్రీన్‌లపై ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని జియో కల్పిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story