OTT: OTTలోకి వచ్చేసిన 5 కొత్త సినిమాలు.. ఎక్కడ చూడొచ్చునంటే.?

OTT: ఇవాళ అర్ధరాత్రి నుంచి పలు OTT ప్లాట్ ఫామ్‌లలో 5 సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లు రానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Ravi
By Ravi
Published on: 7 Aug 2026 8:03 PM IST
OTT
X

OTT: OTTలోకి వచ్చేసిన 5 కొత్త సినిమాలు.. ఎక్కడ చూడొచ్చునంటే.?

OTT: సినిమా రంగంలో డిజిటల్ స్ట్రీమింగ్ వేదికల హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన చిత్రాలతో పాటు నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసేందుకు ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. వారాంతంలో వినోదం పంచేందుకు ప్రముఖ ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే లక్ష్యంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి వివిధ ఓటీటీ యాప్‌లలో సరికొత్త చిత్రాలు అలాగే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం డిజిటల్ స్క్రీన్‌లపై అలరించడానికి రాబోతున్న ఆ ప్రాజెక్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు రెండు ఆసక్తికరమైన చిత్రాలు సిద్ధమయ్యాయి. అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన 'లెనిన్' సినిమాతో పాటు టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని నటించిన 'వంద దేవుళ్లు' సినిమా ఇవాళ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ రెండు చిత్రాలు మంచి వినోదాన్ని పంచుతాయి.

మరోవైపు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు విడుదలవుతున్నాయి. 'హృదయం మురళి' సినిమాతో పాటు 'మై వాపస్ ఆవుంగా' మూవీ డిజిటల్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. వీటితో పాటు యువ నటుడు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆపరేషన్ సఫేథ్ సాగర్' వెబ్ సిరీస్ కూడా ఇవాళే ఓటీటీలోకి రానుంది. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తాయని భావిస్తున్నారు.

అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికపై కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. తిరువీర్ నటించిన కొత్త సినిమాతో పాటు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'ఓ సుకుమారి' సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే ప్రేక్షకులలో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న 'వదంతి' సిరీస్ సీజన్-2 కూడా ఇదే వేదికపై అందుబాటులోకి రానుంది. ఈ వారాంతంలో ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి ఈ సినిమాలు మంచి ఎంపికగా నిలుస్తాయని చెప్పవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story