Exam Web Series : ఎగ్జామ్ పాస్ కావాలంటే టాలెంట్ కాదు.. ఇదే కావాలా?
Exam Web Series : ఒక ఫ్యామిలీ బాగుండాలన్నా, ఒక ఊరు డెవలప్ అవ్వాలన్నా లేదా మొత్తం దేశం బాగుండాలన్నా ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం. నేటి మోడ్రన్
exam web series
Exam Web Series : ఒక ఫ్యామిలీ బాగుండాలన్నా, ఒక ఊరు డెవలప్ అవ్వాలన్నా లేదా మొత్తం దేశం బాగుండాలన్నా ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం. నేటి మోడ్రన్ సొసైటీలో మనం సజావుగా బ్రతకాలి అంటే కమ్యూనికేషన్‌కు భాష ఎంత అవసరమో, లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇప్పటి జనరేషన్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు చదువుకునే వారు తక్కువయ్యారు, చదువును డబ్బులతో కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే, ఎలాంటి కష్టం తెలియని కొందరు కుట్రదారులు దొడ్డిదారిన పేపర్లు లీక్ చేస్తూ అసలైన అభ్యర్థుల కష్టాన్ని, వారి ఉద్యోగాలను దోచుకుంటున్నారు. సరిగ్గా ఇదే కరెంట్ ఇష్యూ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఎగ్జామ్' (Exam). అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్‌లతో లభ్యమవుతోంది.
రియలిస్టిక్ ఇష్యూతో గ్రిప్పింగ్ థ్రిల్లర్
మన విద్యావ్యవస్థలో జరుగుతున్న ఎగ్జామ్ స్కామ్స్, పేపర్ లీకేజీల లాంటి వాస్తవిక ఘటనలను బేస్ చేసుకుని, దానికి కాస్త సినిమాటిక్ లిబర్టీని యాడ్ చేసి ఓ నిజమైన సామాజిక సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సర్కుణమ్. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక పర్‌ఫెక్ట్ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిస్టమ్‌లో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
ట్విస్టులతో సాగే ఆసక్తికరమైన కథాంశం
ఇక ఈ సిరీస్ మెయిన్ స్టోరీ విషయానికొస్తే, తమిళనాడులోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి (DSP) మారుమల్లి చార్జ్ తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. అయితే దారిలోనే ఆమెకు ఒక ఊహించని షాక్ తగులుతుంది. ఝాన్సీ అనే మరో క్యారెక్టర్ ఈ మారుమల్లిని కిడ్నాప్ చేసి, ఆమె స్థానంలో తైకారాకు తానే డిఎస్ పిగా వెళుతుంది. ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హై లెవెల్ ఆఫీసర్ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి, మరీ ఆమె ప్లేస్‌లోకి ఇంకొకరు వెళ్ళడమనేది ప్రాక్టికల్‌గా కాస్త సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైందనిపించినా, కథలోని సస్పెన్స్ మాత్రం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతుంది.
విద్య వ్యవస్థలోని చీకటి కోణాలు
కథ అక్కడి నుండి మెల్ల మెల్లగా అసలు ప్లాట్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అసలు ఒరిజినల్ డిఎస్ పి మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఫేక్ ఆఫీసర్ ఝాన్సీని అక్కడ ఎవరైనా గుర్తుపట్టారా లేదా, అసలు ఈ కిడ్నాప్ వెనుక ఉన్న పెద్ద మాఫియా ఏంటి అన్న సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మన కళ్లముందు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న డార్క్ సైడ్ స్పష్టంగా అర్ధమవుతుంది.
డబ్బులే నిర్ణయించే ఎగ్జామ్ రిజల్ట్స్
ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఒకానొక స్టేజ్‌లో స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా లేదా ఫెయిలవ్వాలా అన్నది వారి టాలెంట్ మీద కాకుండా, వారు ఇచ్చే పైసల (లంచం) మీదే డిపెండ్ అయి ఉంటుందనే నగ్న సత్యం రియలిస్టిక్‌గా రివీల్ అవుతుంది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు , తల్లిదండ్రులు చూసి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. స్ట్రాంగ్ మెసేజ్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఈ 'ఎగ్జామ్' సిరీస్ ప్రైమ్ వీడియోలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడదగ్గ ఒక 'మస్ట్ వాచ్' వెబ్ సిరీస్.




