ఓటీటీకి వచ్చేస్తున్న ధనుష్ మేనల్లుడి ‘లవ్ ఓ లవ్’.. ఎప్పుడంటే?

Love Oh Love: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ ఓ లవ్’.

Srinivas Rao
Published on: 24 July 2026 2:49 PM IST
Love Oh Love
X

ఓటీటీకి వచ్చేస్తున్న ధనుష్ మేనల్లుడి ‘లవ్ ఓ లవ్’.. ఎప్పుడంటే?

Love Oh Love: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లవ్ ఓ లవ్’. మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించని ఈ సినిమా, ఇప్పుడు అనుకున్నదానికంటే ముందే ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ప్రముఖ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ ఈ చిత్రంతోనే తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. జూలై 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో జూలై 31 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. థియేట్రికల్ రన్‌లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

కథ .. నటీనటుల వివరాలు

ఒక కార్పొరేట్ ఉద్యోగి అయిన హీరో.. తన గర్ల్‌ఫ్రెండ్ కారణంగా భారీ క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో చిక్కుకోవడం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ ప్రెషర్స్ వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బందులను పోలీసులకు వివరిస్తూ సాగే వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్‌, కేఎస్ రవికుమార్, వనితా విజయ్‌కుమార్, రమ్య, ఆదిత్య కతిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫాక్స్ సంగీతం అందించగా, జినెమా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story