Con City: ఓటీటీలోకి వచ్చేసిన అర్జున్ దాస్ 'కాన్ సిటీ'..

Con City: టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాన్ సిటీ'.

Srinivas Rao
Published on: 24 July 2026 9:45 AM IST
Con City
X

Con City: ఓటీటీలోకి వచ్చేసిన అర్జున్ దాస్ 'కాన్ సిటీ'..

Con City: టాలీవుడ్, కోలీవుడ్‌లలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాన్ సిటీ'. క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా నేరుగా ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ అందుబాటులో..

హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కాన్ సిటీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు , ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ హైస్ట్ క్రైమ్ కామెడీ చిత్రం, ఓటీటీలో ఎలాంటి రివ్యూలు తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

నటీనటులు … సాంకేతిక నిపుణులు

ఈ చిత్రంలో అర్జున్ దాస్ సరసన అన్నా బెన్ నటిస్తుండగా, కమెడియన్ యోగి బాబు, వడివుక్కరసి, రాధా రవి, తంబి రామయ్య, విటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, పవర్ హౌస్ పిక్చర్స్, క్లౌట్ స్టూడియోస్, ఎం అండ్ ఎం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ క్రైమ్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story