Kanigiri: కనిగిరిలో వైకాపా నిరసన ఇది మెగా డీఎస్సీ కాదు - దగా డీఎస్సీ!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Kanigiri: కనిగిరిలో వైకాపా నిరసన ఇది మెగా డీఎస్సీ కాదు - దగా డీఎస్సీ!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో డీఎస్సీ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ఒంగోలు బస్టాండ్ నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా ఎమ్మెస్సార్ రోడ్డు, వైఎస్సార్ రోడ్డు, చర్చి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా “మెగా డీఎస్సీ కాదు.దగా డీఎస్సీ” అంటూ నినాదాలు చేశారు.
డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారంటూ దద్దాల నారాయణ యాదవ్ ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ప్రశ్నాపత్రాల తయారీకి సంబంధించిన వ్యక్తిగా పేర్కొంటున్న పి. నవీన్ కృష్ణా జిల్లాలో డీఎస్సీ పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ సాధించారని ఆయన ఆరోపించారు.
డీఎస్సీలో ఫోర్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించడం వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, లేనిపక్షంలో హామీలు అమలయ్యే వరకు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమాల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా స్పందించి, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.




