Addanki: ఊరచెరువులో 50 ఎకరాల భూమి ఆక్రమణ: వైఎస్సార్‌సీపీ నేత ఆరోపణ!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని దామవారిపాలెం ఊరచెరువులో దాదాపు 50 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డిమాండ్ చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 3 Aug 2026 7:50 PM IST
Addanki
X

Addanki: ఊరచెరువులో 50 ఎకరాల భూమి ఆక్రమణ: వైఎస్సార్‌సీపీ నేత ఆరోపణ!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం లో దామవారిపాలెం ఊరచెరువు సర్వే నెంబర్ 95 లో 121.8 ఎకరాల చెరువు కు సంబందించిన భూమి అక్రమనుకు గురి అయిందని అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జి చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు.గత 25 సంవత్సరాల నుండి అద్దంకి లో ఉండే లోకల్ నాయకుల అవసరాల నిమిత్తం ఈ చెరువు ఆక్రమణ కు గురవుతూ వస్తుంది అని అన్నారు. సుప్రీం కోర్టు చెరువులను కుంటలను లేదా ఏదైనా వాటర్ బాడీస్ రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టింది అని 121ఎకరాల పైచిలుకు విస్తీర్ణం గల ఈ ఊర చెరువు దాదాపు 50 ఎకరాలు పైనే ఆక్రమణకు గురి

అయి స్థలాలు ప్లాట్లుగా సొమ్ము చేసుకున్నారు అని ,తెలుగు దేశం లో ఉన్న నాయకులే, ఇప్పటికీ వారి కింద పదుల ఎకరాలు ఆక్రమణలో ఉన్నందున దామావారిపాలెం కు చెందిన వారు హైకోర్టు లో పిల్ వేసి ఉన్నారు, అయినను కేసు హై కోర్టు లో ఉండగానే రెండు రోజులు క్రితం 5 కోట్ల తో ఊరచేరువు అభివృద్ధి అని ఊక దంపుడు వార్తలు రాస్తున్నారు. ఇక్కడ ఊర చెరువు మొత్తం విస్తీర్ణం 121.8 ఎకరాలు, అమృత్ 2.0 పథకం కింద కింద నిధులు 5.1 కోటి రూపాయలు, ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలను అభి వృద్ది చేద్దాం అని అనుకుంటున్నారు దీనికి సమాధానం చెప్పాలని ఆయన కోరారు.మీరు ఇచ్చిన డబ్బులతో దాదాపు 2 మూడు చెరువులు అభివృద్ధి చెయ్యవచ్చు,

చేసే అభివృద్ధి ఏందో ప్రజలకు ముందే చెప్పవలసిన బాధ్యత అధికారులు లకు ఉంది అని చింతలపూడి అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story