Yerragondapalem: పేదల పెన్నిధి వైఎస్ఆర్దో ర్నాలలో ఘనంగా జయంతి వేడుకలు!
Yerragondapalem: మార్కాపురం పరిధిలోని పెద్దదోర్నాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి
Yerragondapalem: పేదల పెన్నిధి వైఎస్ఆర్దో ర్నాలలో ఘనంగా జయంతి వేడుకలు!
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
దోర్నాల మండల కన్వీనర్ ఘంటా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు.
జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయనను పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ ప్రదాతగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వైఎస్సార్ చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




